పల్లె రామలింగంకు ఘన నివాళులర్పించిన... చలసాని శ్రీనివాసరావు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లె రామలింగం మంగళవారం మరణించారు. కాగా పల్లె రామలింగం పార్థివ దేహాన్ని బుధవారం సందర్శించి పూలమాల లేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చలసాని శ్రీనివాసరావుతో పాటు పలువురు ఓదార్చారు. నివాళులు అర్పించిన వారిలో చిల్లేపల్లి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గంగ రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, పల్లె నగేష్, పల్లె భాస్కర్, చందుపట్ల వినోద్, మలిగిరెడ్డి సోమిరెడ్డి, మీసాల పిచ్చయ్య, తదితరులు ఉన్నారు.