మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్..

సూర్యాపేట: ఈ నెల 19వ తేదీన కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి కాన్వెంట్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించనున్న మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ సూచించారు. ఈ సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మెగా ఉద్యోగ మేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ మేళాకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. మెగా ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 300 వరకు ప్రముఖ సంస్థలు పాల్గొని...