పేదవారికి సేవ చేయడంలో వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ ముందుండాలి జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు మొరిశెట్టి లక్షాధి ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట : పేదవారికి సేవ చేయడంలో వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ ముందుండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు మొరిశెట్టి లక్షాధి, డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బుధవారం వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యాలయమును వారు ప్రారంభించి మాట్లాడారు. ఎంతోమంది పేద విద్యార్థులు విద్యా, వైద్యం, అగ్రికల్చర్ వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇబ్బందులు పడుతుంటారని అలాంటి పేదవారికి అండగా ఉండడానికి వారాహి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం...