*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం.. *ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి*
సూర్యాపేట రూరల్:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నపోరు వనితల స్ఫూర్తి యాత్ర సూర్యాపేట మండలం బాలెoలగ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ప్రారంభమైన పోరాటం అనంతరం విస్తృత ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారని, అనేక గ్రామాలను...