మాస్కోపై ఉక్రెయిన్ పంజా.. చరిత్రలోనే అత్యంత భారీ డ్రోన్ దాడి
మాస్కో: రష్యా రాజధాని మాస్కో చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ డ్రోన్ దాడిని ఎదుర్కొంది. రష్యా పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న కీలక తరుణంలో ఉక్రెయిన్ ఈ వ్యూహాత్మక దాడులకు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం మొదలైన తర్వాత గుండెకాయ లాంటి మాస్కో నగరంపై ఉక్రెయిన్ ఈ స్థాయిలో భీకర వైమానిక దాడి చేయడం ఇదే తొలిసారి. 1,100 డ్రోన్ల కూల్చివేత.. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దూసుకొచ్చిన సుమారు 1,100 ఉక్రేనియన్ డ్రోన్లను వాయుసేన, సరిహద్దు రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేశాయి. రష్యా ప్రధాన భూభాగంలోని వివిధ నగరాలతో పాటు క్రిమియా, బ్లాక్...