శ్రీవారి సన్నిధిలో ఏపీ, సింగపూర్ మంత్రుల భేటీ
ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్ర అభివృద్ధి, విద్యా సంస్కరణలపై సుదీర్ఘ చర్చ- డ్రగ్స్ రహిత ఏపీ కోసం సింగపూర్ మోడల్- రాష్ట్ర ఐటీఐలకు సింగపూర్ ‘ఐటీఈ’ల సాంకేతిక సహకారం- డ్రాపౌట్ల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్న మంత్రి షణ్ముగం- సింగపూర్ మంత్రితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విద్యా సంస్కరణలపై కీలక చర్చలు జరిగాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగం ఉదయం శ్రీవారిని కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఉభయ నేతలు రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో సంస్కరణలు, సామాజిక...