లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారిణి: రూ.4 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్!
ముఖ్యమైన పాయింట్స్:రూ.6.5 లక్షలకు ఒప్పందం.. లంచం సొమ్ముతో పాటు అదనంగా మరో రూ.2.5 లక్షలు సీజ్ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి అధికారిపై యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు పక్కా వ్యూహంతో మెరుపు దాడి చేశారు. గోల్కొండ జోన్, సర్కిల్-33 పరిధిలోని GHMC Mehdipatnam కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి తులసిరామ్ సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. బాధితుడి భవన నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన 'స్పీకింగ్ ఆర్డర్స్'ను తుంగలో తొక్కి, నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు భవిష్యత్తులో వేధించకుండా ఉండేందుకు సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేశారు....