Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

1వ వార్డు గంగమ్మ దేవాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాటుకు కృషి

Author
Posted By RK SAKSHI
| 16 Sep 2026, 04:38 PM | సూర్యాపేట
1వ వార్డు గంగమ్మ దేవాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాటుకు కృషి

సూర్యాపేట : 1వ వార్డు కుడకుడలోని శ్రీ గంగా దేవమ్మ దేవాలయం వద్ద చెరువులో బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్థానిక కౌన్సిలర్ బానోతు సైదులు నాయక్ మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేధిత లక్షాదికి వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన అధికారులు బుధవారం బతుకమ్మ ఘాట్ ఏర్పాటు స్థలాన్ని సందర్శించారు. చెరువులో బతుకమ్మ నిమజ్జనానికి అనువుగా ఉండే విధంగా ఘాట్ తో పాటు మెట్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. త్వరలో రానున్న బతుకమ్మ పండుగ నాటికి ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాధి, మున్సిపల్ ఈఈ కిరణ్ కుమార్, డిఈ ప్రణయ్ రెడ్డి, 2వ వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు బూర సైదులు గౌడ్, రెడ్డబోయిన శివమణి, కాసార్ల మహేష్, పొన్నేబోయిన మహేష్, కుశనపెల్లి సుధాకర్, కొసనోజు ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి