Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఏపీలో స్థానిక సమరానికి 'సుప్రీం' గ్రీన్ సిగ్నల్

Author
Posted By M TODAY NEWS
| 09 Oct 2026, 08:41 PM | ANDHRA PRADESH
ఏపీలో స్థానిక సమరానికి 'సుప్రీం' గ్రీన్ సిగ్నల్

ముఖ్యమైన పాయింట్స్:

  • రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం.. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను Supreme Court కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేస్తూ, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. హైకోర్టు నిర్దేశించిన గడువులోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక పోరుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీలో సహచర మంత్రులకు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం లేదా ఈ నెల 12వ తేదీన AP Local Body Elections Schedule వెలువడటం ఖాయమని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు) ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. నవంబరు ద్వితీయార్థంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ పూర్తి చేసి, నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ఐక్యతకు భంగం కలగకుండా, అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission - SEC) ఎన్నికల నిర్వహణపై సన్నాహాలు ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇవి కూడా చదవండి